24-05-2025 11:42:19 PM
గాయపడిన బాధితులు బిచ్కుంద వాసులు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం 44 వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా(Kamareddy district) బిచ్కుంద కు చెందిన నరేష్, సాయిలలో కామారెడ్డి నుంచి బిచ్కుంద కు బైక్ పై వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సదాశివ నగర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివ నగర్ పోలీసులు తెలిపారు.