19-01-2026 12:28:53 AM
ఆలేరు, జనవరి 18 : బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హాయాంలోనే అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో కొలనుపాక రోడ్డు దుంతరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో ఆలేరుకు ఎన్నో అభివృద్ధి పనులను చేశామన్నారు.
ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో పార్టీ అభ్యర్థుల గెలుపులకు కార్యకర్తలను కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బొట్ల పరమేష్, పుట్ట మల్లేష్, సీస మహేశ్వరి, కర్రె అశోక్, పంతం కృష్ణ, జట్ట సిద్దులు, గంధమల్ల యాదగిరి, కోనాపురం నాగరాజు, మున్సిపాలిటీ పరిధిలోని నాయకులు పాల్గొన్నారు.