19-01-2026 12:30:00 AM
నూతనకల్, జనవరి 18: మండల పరిధిలోని లింగంపల్లి క్రాస్ రోడ్డు నుండి అలుగునూరు మీదుగా పెదనేమిల వరకు సాగే రోడ్డు నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఎమ్మెల్యే మందుల సామేల్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అలుగునూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బంటు క్రాంతి కొనియాడారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.
దశబ్దాలుగా అలుగునూరు గ్రామ ప్రజలు రోడ్డు సౌక ర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ప్రజల కష్టాలను స్వయంగా చూసిన ఎమ్మెల్యే,ప్రత్యేక చొరవతో గ్రామ సడక్ యోజన నిధులను మంజూరు చేయించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు.పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లు, అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం ఆయనకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని,ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, వారం రోజుల్లో పనులు ప్రారంభం కావాలని ఆయన ఆదేశించడం హర్షణీయమని క్రాంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు .