calender_icon.png 19 January, 2026 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రంలో పల్లకీ సేవ

19-01-2026 12:28:31 AM

బెజ్జూర్, జనవరి 18 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుక పెళ్లి ’బి’ అభయ ఆంజనేయస్వామి ఆలయం నుండి మహారాష్ట్రలోని చెప్రాలకు భక్తులు 21 మహా పాదయా త్ర నిర్వహించారు.మహా పాదయాత్రగా వెళ్లిన  భక్తులకు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయగా, పాదయాత్ర భక్తులకు బీజేపీ నాయకులు శనివారం రాత్రి అన్న ప్రసాదం వితరణ చేశారు. అలాగే భక్తులకు ఎమ్మెల్సీ దండేవిటల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ యువసేన నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధాపూర్ సర్పంచ్ చెండే పద్మ శంకర్, సిర్పూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ శ్రీ వర్ధన్, మాజీ ఉపసర్పంచ్ సుధాకర్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొట్రంగి రామకృష్ణ, మండల కన్వీనర్ మహేష్ పాల్గొన్నారు.