21-02-2026 02:13:36 AM
వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ప్రణాళిక బద్ధంగా పనిచేసే వనపర్తి మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామ ని, వారానికి వార్డు సందర్శించి సమస్యల పరిష్కారానికి పాటుపడతామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ల పదవీ బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గా మాధవి , వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్ తో పాటు మరో 20 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే గారి సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ మాధవి గారు తన మొట్టమొదటి సంతకాన్ని మున్సిపల్ ఉద్యోగులకు అందించే అలవెన్స్ ఫైల్ పై, తాగునీటి సమస్యల పరిష్కారం ఫైల్ పై సంతకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది ఏళ్లలో నాలుగు రోడ్లు రెండు చెరువు చెరువు కట్టలపై రెవిట్మెంట్లు కట్టి మామూలు దొబ్బిన నాయకు లు అదే అభివృద్ధి అనుకున్నారు. అభివృద్ధి అంటే గల్లీ నుంచి మొదలై మెయిన్ రోడ్డుకు చేరుకోవాలని వనపర్తి పట్టణంలోని ప్రతి గల్లీని సందర్శించి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
ఇప్పటికే రూ 54 కోట్ల రూపాయల తో ప్రతి వార్డులో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టామని రూ 50 కోట్లు వనపర్తి పట్టణానికి 20 కోట్లు పెబ్బేరు పట్టణానికి మంజూరు చేయించి పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందరీకరణ తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. వనపర్తి పట్టణానికి 2000 ఇందిరమ్మ ఇండ్లు, పెబ్బేరు పట్టడానికి 500 ఇందిరమ్మ ఇండ్లు అధినంగా మంజూరు చేయించి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు.
గత పాలకుల లాగా పంచ కట్టుకుని సోకులకు పోయే రకం కాదని పని చేస్తూ ప్రజల మనలను పొందుతూ ముం దుకెళతామన్నారు. గత రెండేళ్లుగా వనపర్తి నియోజకవర్గంలో సర్పంచుల బాధ్యతలు, ఎంపిటిసి బాధ్యతలు, కౌన్సిలర్ల బాధ్యతలు కూడా ఎమ్మెల్యేగా నేనే చూసుకున్నానని నేటి నుంచి ఎవరి బాధ్యతలు వారు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఎక్కడ ఎలాంటి తప్పులకు తావు లేకుండా మున్సిపల్ అభివృద్ధి కోసం పెద్ద జీతగాళ్లలా పనిచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
ప్రతి వార్డు అభివృద్ధి చెందాలని అభివృద్ధి పనులకు నిధులు లేవనే మాట రాకుండా అవసరమైతే తననిధుల నుంచి కూడా ఖర్చు చేసి అన్ని రంగా ల్లో అభివృద్ధి పరుస్తామన్నారు. నేటి నుంచి అందరిపై గురుదరమైన బాధ్యతలు ఉన్నాయని వాటిని విస్మరించకుండా నిర్లక్ష్యం చేయకుండా అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉపయోగించి పట్టణ ప్రజల మన్ననలు పొందుతామని ఎమ్మెల్యే చెప్పా రు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వ సుజాత, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , వనపర్తి మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు మహిళలు యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.