21-02-2026 02:15:11 AM
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 20: కొత్త ఏజెన్సీ కాంట్రాక్టు వారు మాకు లంచాలు ఇస్తేనే మీ ఫర్ఫార్మెన్స్ శాతం ఇస్తామంటూ ప్రభుత్వ ఆర్‌ఎంవోలు బంగారయ్య రెడ్డి మేడమ్ లు కొత్త కాంట్రాక్టు విజయేంద్ర ఏజెన్సీ ని ఇబ్బంది పెడుతున్నారని కాంట్రాక్టర్ సందీప్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ పాత కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి 70 మంది కార్మికులతో 140 మంది ఉన్నారని ఆర్ ఎం ఓ లకు లంచాలు ఇచ్చి పనిచేస్తున్నట్లు తప్పుడు రికార్డుల రాయించుకొని లక్షల సొమ్ము కాజేస్తున్నాడని ఎన్నో మార్లు వచ్చిన ఆరోపణలకు జిల్లా కలెక్టర్ ఏజెన్సీని పక్కనపెట్టి విజయేంద్ర ఏజెన్సీకి అప్పజెప్పారని సందీప్ కుమార్ అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులు ఎం సి హెచ్, జి జి హెచ్ లో 149 మంది కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయేంద్ర ఏజెన్సీ వారికి కలెక్టర్ అప్పజెప్పి నాలుగు నెలలు మాత్రమే కావస్తుంది. రెండు నెలల్లో సమస్యలను పరిష్కరించడానికి పని సరిపో యిందని. రెండు ఆసుపత్రిలో కావలసినంత సిబ్బందిని ఏర్పాటు చేశామని కాంట్రాక్టర్ సందీప్ కుమార్ తెలిపారు.
ప్రతినిత్యం మా సిబ్బంది రెండు ఆసుపత్రిలో పనితీరు మాత్రం చాలా బాగుందని తెలిపారు కానీ ప్రభుత్వ ఆర్‌ఎంవోలు డాక్టర్ రెడ్డి మేడం, డాక్టర్ బంగారయ్య ఎస్ ఎన్ సి యు వార్డులో రెండేళ్ల క్రితం ఓ చిన్న పాము కనిపించింది అప్పట్లో వర్షాకాలం ఉండేది. ఆ రెండేళ్ల ఫోటో ప్రస్తుతం చూయించి ప్రస్తుత ఏజెన్సీని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. ఇప్పటికీ తమ బిల్లు పూర్తిగా రాలేదని బిల్లు అడిగితే పర్ఫామెన్స్ 50 శాతం మాత్రమే వారి పనితీరుకు గమనర్హంగా ఉందని కాంట్రాక్టర్ సందీప్ కుమార్ అన్నారు.
పాత అంబియన్స్ కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి లంచాలు ఇస్తుండడం పట్ల ప్రభుత్వ అధికారులు నోరు మెదపలేదని అన్నారు. విజయేంద్ర ఏజెన్సీ లంచాలు ఇవ్వకపోవడం తో ఇలా ప్రతిదానికి ఫోటోలు పెట్టి ఇది బాగాలేదు అది బాగా లేదంటూ సాకులు చెబుతూ పనిచేసుకోలేకపోతున్నామని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయేంద్ర ఏజెన్సీ కింద పని చేస్తున్న కార్మికులు మూడు షిఫ్టుల్లో ప్రతి షిఫ్ట్ కూడా ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుతున్నారని అన్నారు. రెండు నెలల లో జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారని ఇలాంటి లోటుపాట్లు కలెక్టర్కు కాన రాలేదని అన్నారు.
లంచాలకు మరిగిన ప్రభుత్వ అధికారులు తమతో ఒక మాట కలెక్టర్ తో ఓ మాట పనితీరు విషయంలో రికార్డులు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి లంచాలకు మరిగిన ప్రభుత్వ వీరి పనితీరు ఇలాగే కొనసాగుతుందని వెంటనే ప్రభుత్వం ముక్కుకుతాడేయాలని విజయేంద్ర ఏజెన్సీ కాంట్రాక్టర్ సందీప్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు.