14 May, 2026 | 4:02 AM

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి కార్యక్రమాలు

14-05-2026 02:56 AM

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యంతో నే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు  వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి యోగ సెంటర్లో జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్య వారోత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడారు. ప్రజా సంక్షేమం, గ్రామ అభివృద్ధి, విద్య పురోగతిపై ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ లు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.