15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పీఎం శ్రీ స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

20-02-2026 08:10 PM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక అయిన స్కూళ్లలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.  పీఎంశ్రీ కింద ఎంపిక అయిన విద్యాలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో ఇంచార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఎంశ్రీ కింద జిల్లాలో మొత్తం 16 విద్యాలయాలు ఎంపిక అయ్యాయని, వాటిలో అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ లు, సైన్స్ ల్యాబ్ లు, లైబ్రరీలు, వర్షం నీరు ఇంకుడు గుంతలు ఇతర నిర్మాణాలు ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు.

ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. పీఎంశ్రీ కింద ఎంపికైన విద్యాలయాల్లో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయా స్కూళ్లలో పనులను జిల్లా విద్యాధికారి పరిశీలించాలని ఆదేశించారు. కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలని సూచించారు.సమీక్షలో జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, టీజీఈడబ్ల్యూఐడీసీ డీఈ సత్యనారాయణ రావు, ఏఈలు నాగరాజు, అశోక్ కుమార్, అధికారులు తదితరులు ఉన్నారు.