20-02-2026 08:04:36 PM
చిట్యాల,(విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ తన వార్డు ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంటూ, కరెంటు వైర్లకు అడ్డుగా ఉన్న కంప చెట్లను శుక్రవారం సొంత ఖర్చులతో జెసిబి సాయంతో తొలగించారు. వార్డులో దొంగలతో చాలా ఇబ్బందులకు గురవుతున్న కాలనీవాసులకు ఇచ్చిన మాట ప్రకారం కంపచెట్లను తొలగించి కాలనీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
వార్డు ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందిన ఆయన, కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని పేర్కొన్నారు. వార్డుకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన వార్డు ప్రజానీకానికి చిట్యాల కౌన్సిలర్ కుక్కల మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్ తీసుకున్న ఈ చొరవ పట్ల కాలనీవాసులు మారగోని యాదగిరి, రుద్రారపు నరసింహ, రుద్రారపు పెద్దులు, రుద్రారపు లింగస్వామి, అమరోజు మదన్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.