అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలి
- ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘు రామ్ రెడ్డి
దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష
తాగునీరు, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి మహబూబాబాద్
పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 8,(విజయక్రాంతి): ప్రతి శాఖ అధికారులు బాధ్యతా యుతంగా వ్యవహరించి జిల్లా అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురాంరెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దిశా సర్వసభ్య సమావేశం బుధవారం జిల్లా కేంద్ర ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కో-చైర్మన్గా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, దిశా కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు హాజర య్యారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పనుల పురోగతిని నివేదికల రూపం లో ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి, గత నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టంగా సూచించారు. ఉపాధి హామీ పథకం లో భాగంగా గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తుందని, ఇప్పుడు కేవలం 60 శాతం మాత్రమే ఇచ్చే విధంగా మార్పు వచ్చి, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలో అనేక మార్పులు రావడం వలన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చర్చ జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమని, ప్రతి పథకం లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులకు సమయానికి ప్రయోజనాలు చేరేలా పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
వేసవి కాలంలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.మణుగూరు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం తదితర ప్రాంతాల ప్రభుత్వ ఆసుపత్రుల పరిశుభ్రత, ఆహార నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, అంబులెన్స్, డయాలసిస్ సేవల విస్తరణ, సికిల్ సెల్ అనీమియా, హెచ్పీవీ వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమాలపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి అని సూచించారు.
మిషన్ భగీరథ, అమృత్ పథకాల కింద తాగునీటి సరఫరా, పైప్లైన్లీకేజీల ను తొలగించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీలలో త్రాగునీటి సరఫరా పనులను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, ఆర్ & బి, విద్యుత్ శాఖల పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఐటీడీఎ నిధులతో చేపట్టిన పనులలో ఆలస్యానికి కారణాలను వివరించాలని అధికారులు నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుమూల ప్రాంతాల వరకు త్రాగునీటి సరఫరా కల్పించాలని, ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువు ల్లో పూర్తి చేయడం కోసం సంబంధిత శాఖ ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దిశా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి అమలును వేగవంతం చేయా లని, ప్రతి శాఖ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పెండిం గ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో చేరేలా పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని, పనుల నాణ్యతపై ఎటువంటి రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.శాసన సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై అధికారులు సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య,
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తదితరులు తమ నియోజకవర్గాల్లో పథకాల అమలు స్థితిగతులపై అధికా రుల నుంచి సవివర నివేదికలు కోరారు. ఈ సమావేశంలో ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, అశ్వరావుపేట మున్సిపల్ చైర్ పర్సన్ శశికళ, డి ఆర్ డి ఓ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, దిశా కమిటీ సభ్యులు బుర్ర సురేష్, యేసుమని, స్వర్ణ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




