15 June, 2026 | 8:19 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

భద్రాచలంలో ఏప్రిల్ 10న ఆదివాసీ సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనం

09-04-2026 12:32 AM
  1. కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకావిష్కరణ

హాజరుకానున్న రాష్ట్ర మంత్రి సీతక్క

భద్రాచలం, ఏప్రిల్ 8,(విజయక్రాంతి) : భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్ లో ఏప్రిల్ 10 వ తేదీన ఆదివాసీ సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనం, కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,

స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వెల్లడించారు. వీరితో పాటు పలువురు శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా ఉన్నతాధికారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసి పెద్దలు తదితరులు పాల్గొంటున్నందున ఆదివాసి గిరిజన సంఘాల ప్రతినిధులు మరియు ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నారు.