15 June, 2026 | 7:29 PM

Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •  

దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన

15-06-2026 06:29 PM

దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండలోని కెనరా బ్యాంక్ లో సోమవారం పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కామారెడ్డి ఎస్పీ.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దోమకొండ సబ్-ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలతో మోసపోతే టోల్ ఫ్రీ నం:1930 కాల్ చేయాలనీ ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని బ్యాంకు ఆఫీసర్లు గాని పోలీస్ ఆఫీసర్లు గాని ఓటీపీలు చెప్పమని అడగరు. ఖాతాదారులు ఓటీపీలను ఎవరికీ కూడా చెప్పవద్దు అని  సూచించారు. 

 అత్యవసర సమయంలో డయల్ 100, 112 కు కాల్ చేయాలని సూచించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్స్.రామంచ తిరుపతి.శేషరావు పిసిలు.ప్రభాకర్.సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, కామారెడ్డి షి టీమ్ మహిళా కానిస్టేబుల్ ప్రవీణ, బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బ్యాంక్ కస్టమర్స్ పాల్గొన్నారు.