calender_icon.png 20 December, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి

20-12-2025 01:29:37 AM

  1. రోప్ వే నిర్మాణ పనులు నాణ్యతతో డిసెంబర్ 2026 నాటికి పూర్తి

నిర్ణిత షెడ్యూల్ ప్రకారం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు పూర్తి

ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల

ఖమ్మం, డిసెంబర్ 19 (విజయ క్రాంతి): నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు షె డ్యూల్ ప్రకారం నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం కలెక్టరేట్ లో ఖమ్మం జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారుల తో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సమీక్షించారు.

రోప్ వే, సింథటిక్ ట్రాక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శిల్పారామం, క్రికెట్ స్టేడియం, యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం, వైద్య కళాశాల, కేబుల్ బ్రిడ్జి, మున్నేరు రిటైనింగ్ వాల్, సమీకృత మార్కెట్, మంచుకొండ ఎత్తిపోతల పథకం, హరిత హోటల్, టిటిడి స్కూల్, స్వామి నా రాయణ గురుకుల స్కూల్, సీతారామ ఎత్తిపోతల పథకం, వెలుగు మట్ల అర్బన్ పార్క్ పనులపై మంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గత అనుభవాలకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామీణప్రాంతాల్లో మ్యానువల్ గా చేసే అభివృద్ధి పనులను నరేగా క్రింద బుక్ చేయాలని అన్నారు. పచ్చదనం పెంచేందుకు గ్రామాలలో ప్రణాళికా బద్ధం గా మొక్కలు నాటాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అ న్నారు.

ప్రతి శాఖ నుంచి నరేగా ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపాలని అన్నా రు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నది జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు వీలుగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టు పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసుకుంటే ట్రీబ్యూనల్ ద్వారా నీటి కేటాయింపులు అధికంగా జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇబ్బందులు వస్తే సీతారామఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటి సరఫరా చేయగలమని, దానికి సంబంధించిన అనుమ తులు సాధించేలా ఫాలో అప్ చేయాలని అన్నారు. సత్తుపల్లి ట్రంకు, 4వ పంప్ హౌస్, పాలేరు టన్నెల్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు.

రోప్ వే పనులు ప్రస్తుతానికి 20 శాతం పని జరిగిందని, రోప్ వే లో వాడే మేటిరియల్ తయారీ దశలో ప్రతి అంశాన్ని అధికారులు నిశితంగా పరిశీలించాలని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 2025 లో భూమి అప్పగించినందున 15 నెలలో అగ్రిమెంట్ ప్రకారం డిసెంబర్ 2026 వరకు పనులు పూర్తి కావాలని అన్నారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డిఆర్‌ఓ ఏ. పద్మశ్రీ, జిల్లా అధికారులు, సంబంధిత శాఖ అధికారులు, తదిత రులు పాల్గొన్నారు.