20-12-2025 01:28:27 AM
నిజామాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ భవనంలో గల ఐడి ఓసి మీటింగ్ హాల్ లో రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెస్సా అధ్యక్షులు రమన్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రెసా అధ్యక్షులు రమణ రెడ్డి మాట్లాడుతూ జీసస్ ప్రభువైన ఏసుక్రీస్తు ఒక నీతి మార్గంలో నడవాలని ప్రజలందరూ ప్రేమ సంతోషములతో వర్ధిల్లాలని ఆయన కోరారు.
మనుషులందరూ అన్యోన్యంగా కలిసి ఉండాలని కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ బ్రతకాలని ఒక మంచి మార్గం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని కాబట్టి ప్రతి మనుషుడు కూడా జీవితాన్ని సంతోషమైన జీవితాన్ని మంచి మార్గాన్ని ఎంచుకొని నడవాలని అప్పుడు ఈ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు కూడా జీసస్ మార్గంలో సత్యము ఉంది గనుక ప్రజలందరూ మంచి మార్గంలో ఉన్నట్లయితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని తెలుపుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
కలెక్టరేట్ ఎ ఓ ప్రశాంత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జీసస్ ఈ లోకంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారని తెలియజేశారుసందేశకులు ఆనంద్ రాజ్ పాస్టర్ దేవుని సందేశం ఇచ్చారు . ఈ యొక్క కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు పి శ్రీనివాస్ రావు కోశాధికారి విజయ్ కాంత్ రావు ఉపాధ్యక్షులు భూపతి ప్రభువు కలెక్టరేట్ సూపరిండెంట్ బాలరాజు అధికారులు ఐ డి ఓ సి లోని అన్ని శాఖల ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.