18 May, 2026 | 11:30 PM

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

04-02-2025 04:28 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోనీ మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులతో పట్టణంలో చేపట్టిన పనులను సమీక్షించారు. పట్టణంలో సిఎస్ఆర్ పథకం కింద చేపట్టిన పనులను త్వరితగతన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం చతులాపూర్ లోని డంపింగ్ యార్డ్ నీ సందర్శించి తడి, పొడి, చెత్త వేరు చేయాలని, పట్టణంలో పారిశుద్ధం మెరుగుపరిచి ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని సూచించారు. అంతే  కాకుండా ఎస్వీ టెంపుల్ ఏరియాలో గల నర్సరీని సందర్శించి రాబోవు వేసవికాలం దృష్ట్యా మొక్కలకు షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుని, వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, డిప్యూటీ ఇంజనీర్ ఎం సుమతి, సానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యాంసుందర్, రెవెన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.