5 July, 2026 | 9:35 PM

దర్శనానికి వచ్చి.. గుండెపోటుతో భక్తుడు మృతి

11-06-2024 04:26 PM

రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. జనగామ జిల్లాకు చెందిన బొట్ల వినయ్ కుమార్(24) అనే యువకుడు అకస్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందాడు. సోమవారం రాజన్నను దర్శించుకున్న వినయ్ కుమార్ కుటుంబ సభ్యులు మంగళవారం బద్ధి పోచమ్మ ఆలయంలో బోనాలు చెల్లించేందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఛాతీలో మంటగా ఉందని కుటుంబసభ్యులకు తెలిపిన వినయ్ కుమార్ సమీపంలోని మెడికల్ దుకాణానికి వెళ్లి ఓ.ఆర్.ఎస్ తీసుకుని తిరిగి వస్తున్న తరుణంలో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్ సాయంతో సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వినయ్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.