స్కానింగ్ సెంటర్లపై దాడులు
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్లలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఉప అధికారిణి రజిత మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఫార్మ్ ఎఫ్ లో గర్భిణీ స్త్రీల పూర్తి వివరములు, వారి స్కానింగ్ చేయడానికి గల కారణాలను పొందుపరుచాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్దారణ చట్టరీత్యా నేరమన్నారు. నిబంధనలు మొదటి సారి ఉల్లంఘించిన వారిపై మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించబడుతుందన్నారు. తదువరి ఉల్లంఘనకు యాభై వేల రూపాయల జరిమానాతోబాటు ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ లేని స్కానింగ్ సెంటర్లు, పిసిపిఎన్ డి టి యాక్ట్ ప్రకారం అన్ని విధాలుగా వివరాలు నమోదు చేయవలసిందిగా లేనియెడల వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు.






