రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల,విజయక్రాంతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం దర్శనానికి పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయంలో ఆజిత సేవలు రద్దు పరచి శీఘ్రదర్శనం అమలుపరిచారు.గర్భాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు ఏడు గంటల సమయం పట్టింది. ప్రాంగణంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. కళాభవన్ లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతాలు స్వామివారి నిత్య కళ్యాణాల్లో భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయం బద్దిపోచమ్మ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.






