24 May, 2026 | 6:27 AM

మల్లారెడ్డి చెప్పిన మాటలు వింటున్న కడక్ నాథ్ కోడి

17-06-2024 06:28 PM

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడమల మల్లారెడ్డి కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఈ ఫారంలో కడక్‌నాథ్‌ అనే రకం కోడి తన మాటలు చెప్పినట్లు వింటోందని ఆయన చెప్పారు. ఆ కోడిని ముందుకు రామ్మంటే ముందుకు వస్తుంది.. వెనుకు వెళ్లమని చెప్పితే వెనుకకు వెళుతుంది. మల్లారెడ్డి ఎక్కడికి వెళితే ఆయనతోనే అక్కడికి వెళుతుంది. ఈ ఆసక్తికర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వింతకోడిని తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఇదో వింతేమో అని చర్చించుకోవడం విశేషం. కాగా అన్ని కోళ్లలో ఆ కడక్ నాథ్ కోడి మాత్రమే తాను చెప్పినట్లు వింటుందని, తనతోనే కాలం గడుపుతుందని రైతు ఎడమల మల్లారెడ్డి పేర్కొన్నారు.