calender_icon.png 21 January, 2026 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

21-01-2026 12:47:29 AM

కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్ష 

మేడారం, జనవరి 20 (విజయక్రాంతి): మేడారం మహాజాతరకు ఇంకా వారం రోజుల సమయం మిగిలి ఉన్నందున తుది దశకు చేరుకున్న అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ములుగు జిల్లా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని మేడారం హరిత హోటల్ లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.