21-01-2026 12:44:56 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
బిచ్కుంద, జనవరి 20 (విజయ క్రాంతి): మారెడ్డి జిల్లా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా..మంగళవారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని కందర్పల్లి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక-సామాజిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి మున్సిపల్ కమిషనర్ షేక్ హయుమ్, తహసీల్దార్ స్థానిక మండల నాయకులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్త భౌతిక గాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తోట
బిచ్కుంద, జనవరి 20 (విజయ క్రాంతి): బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డ్ మెంబర్ కల్లోల గంగారాం మరణించిన విషయం తెలుసుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. కల్లోల గంగారాం పార్టీకి మరియు ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని,గంగారాం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.