calender_icon.png 11 February, 2026 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రిని భక్తులు అత్యంత వైభవంగా జరుపుకోవాలి

11-02-2026 01:20:30 AM

  1. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ 

ఈనెల 14 నుంచి 18 వరకు ఉత్సవాలు

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని, హనుమకొండలోని వే యి స్తంభాల దేవాలయంలో నిర్వహించనున్న, మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు ను పూర్తి చేయాలని, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి 18 వ రకు జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భ క్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎ టువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముంద స్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మంగళవారం జిడబ్ల్యుఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ, పోలీస్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను సందర్శించి, భక్తులకు అందించే సౌ కర్యాలు పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, తా గునీటి వసతి, విద్యుత్ సరఫరా, క్యూలైన్ల ఏర్పాటు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఆలయ అర్చకు లు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీరుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని, వేదమంత్రాలు సాక్షిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వేయి స్తంభాల దేవాలయంలో మ హాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవం గా నిర్వహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అన్నారు. భక్తు ల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని, తాగునీటి స దుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ నిర్వాహనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలువ పందిళ్ళు ఏర్పాటు చే యాలని, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి, అ త్యవసరమైన సేవలు అందుబాటులో ఉం చాలని అధికారులను కోరారు.

భక్తుల భద్ర త కోసం పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు. భక్తులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో అధికారులకు సహక రించాలని, ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పోతుల సినిమా డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, సతీష్, ఆలయ ఈవో అనిల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.