మూడు రోజుల్లో తాత్కాలికంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు డీజీపీ హామీ
.రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
బోథ్(విజయ క్రాంతి): గత కొన్ని రోజులుగా బోథ్ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదాల వల్ల రైతుల సాగు చేసుకున్న పంటలు బూడిద పాలు అవుతున్నాయని అందుకు తక్షణమే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఆదివారం సాయంత్రం సంబంధిత డిజిపి విక్రమ్ సింగ్ ను కోరారు ఈ మేరకు ఆయన విజయ క్రాంతి తో మాట్లాడుతూ జరిగిన నష్టం విషయమై ఆయన వివరించడం జరిగింది అన్నారు
తక్షణమే తాత్కాలికంగా నాయనా అగ్నిమాపక కేంద్రాన్ని బోత్ లో ఏర్పాటు చేయాలని కోరమన్నారు .స్పందించిన డిజిపి ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు .చేతికందేపంట కండ్ల ముందు కాలిపోతుంటే రైతులకు తీరని దుఃఖంతో ఉన్నారని ఆయన వాపోయారు. ప్రభుత్వం తక్షణమే రైతన్న ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కష్టాల్లో ఉన్న రైతన్నను ఆదుకునేది రాజకీయం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. రైతన్న కుటుంబాలకు పార్టీలకతీతంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు






