మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ జితేందర్
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలోని ములుగు జిల్లా ఏటారు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఆదివారం జరిగిన జారీ మావోయిస్టు ఎన్ కౌంటర్ పై డీజీపీ జితేందర్ స్పందించారు. మావోయిస్టులపై విషపదార్థాలు ప్రయోగించారనేది దుష్ప్రచారమని, మావోయిస్టులు స్పృహ కోల్పోయాక కాల్పులు జరిపామనడం అవాస్తవమన్నారు. ఎజెన్సీ అడవుల్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారని డీజీపీ పేర్కొన్నారు. పోలీసులు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో సోమవారం పౌర హక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిన్ దాఖలు చేసింది. హైకోర్టు, ఎన్ హెచ్ఆర్సీ సూచనల మేరకు శవపరీక్షలు నిర్వహణ జరిగిందన్నారు. ఎన్ కౌంటర్ కేసు దర్యాప్తు అధాకారిగా వేరే జిల్లా డీఎస్పీని నియమించినట్లు డీజీపీ జితేందర్ చెప్పారు.




