4 July, 2026 | 3:41 PM

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన దమ్మపేట బార్ అసోసియేషన్

04-07-2026 03:03 PM

దమ్మపేట,(విజయక్రాంతి): శనివారం దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్ అధ్యక్షతన కొత్తగూడెం జిల్లా కోర్ట్ కి వచ్చిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాస్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలను హై కోర్ట్ న్యాయమూర్తి కి వివరించారు. దమ్మపేటకు నూతనంగా సబ్ కోర్టు మంజూరు చేయాలని, దమ్మపేట కోర్టులో సిబ్బంది చాలా తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుందని త్వరగా కోర్టు సిబ్బందిని నియమించాలని కోరారు. దమ్మపేట కోర్టులో న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అనుమతి ఇవ్వవలసిందిగా వినతి పత్రం అందించారు. ఈ సమస్యలపై న్యాయమూర్తి  జే శ్రీనివాస్ రావు సానుకూలంగా స్పందించారని బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్కీనేని నరేంద్రబాబు, ట్రెజరర్ తామ బాలరాజు, స్పోర్ట్స్ సెక్రటరీ తిర్నాటి సంజయ్, ఆర్గనైజషన్ సెక్రటరీ నల్లపు ఉదయ్ కుమార్, ఈసీ మెంబర్  2 గద్దల అప్పారావు, మహిళ న్యాయవాది కాలం సంధ్యా రాణి తదితరులు పాల్గొన్నారు.