4 July, 2026 | 3:10 PM

ఎల్ నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి

04-07-2026 02:02 PM

 ఖానాపూర్ వ్యవసాయ అధికారి జగదీశ్వర్

 ఖానాపూర్ (విజయక్రాంతి): రానున్న వానాకాలం పంటల నేపథ్యంలో వర్షాలపై ఎల్నినో ప్రభావం ఉండబోతుందని రైతులు అప్రమత్తంగా ఉండి పంట మార్పిడి పద్ధతులు పాటించాలని ఖానాపూర్ వ్యవసాయ అధికారి జగదీశ్వర్ అన్నారు. సాధారణంగా వరి పంట వేసే రైతులు చిరుధాన్యాలు, మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, లాంటి పంటల వైపు మొగ్గుచూపితే ఆర్థిక లాభాలు పొందవచ్చని ఒకవేళ వరి లాంటి పంటలు వేస్తే ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుందని రైతులు గమనించాలని వ్యవసాయ అధికారి వివరించారు.