4 July, 2026 | 3:17 PM

పాకిస్థాన్, శ్రీలంకలా తెలంగాణ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

04-07-2026 02:33 PM
  1. హిందువులు జాగృతం కాకుంటే.. మైనార్టీలవుతారు
  2. సర్ పై రేవంత్ ప్రభుత్వం కుట్ర
  3. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తనే.. అప్పులు తీరుతాయి
  4. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు రూ. 10 లక్షల కోట్ల అప్పులు

హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు(Congress and BRS parties) రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjayవేములవాడ దేశాయిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అప్పులు, అవినీతి, అక్రమాలు చేశాయని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం డబ్బులిస్తే.. దారి మళ్లించారని తెలిపారు.

ఇలానే కొనసాగితే పాకిస్థాన్, శ్రీలంకలా తెలంగాణ మారుతోందని స్పష్టం చేశారు. తెంలగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్(Double engine sarkar) వస్తేనే.. అప్పులు తీరుతాయని వెల్లడించారు. సర్ పై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు. హిందువులు జాగృతం కాకుంటే.. మైనార్టీలు అవుతారని బండి సంజయ్ హెచ్చరించారు. చాలా చోట్ల హిందువుల ఓట్లను(Hindu votes) తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రోహింగ్యాల ఓట్లు తొలగించకుండా ఎంఐఎం అడ్డుకుంటుందన్న కేంద్రమంత్రి హిందువుల ఓట్లు తగ్గించి.. మైనార్టీల ఓట్లను పెంచాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ మంత్రులు, మాజీ మంత్రులు సవాళ్లు ప్రతీ సవాళ్లు చేస్తున్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ బయటకు వచ్చి అప్పులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.