మార్చి 25న దమ్మపేట వారాంతపు సంత వేలం పాట
21-03-2026 08:49 PM
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు 2026-27 సంవత్సరమునకు గాను గ్రామ పంచాయతీ పరిధిలో వారాంతపు సంత వేలం వేయుటకు రూ.1,15,000/- (ఒక లక్ష పదహేను వేల రూపాయలు) మద్దతు ధర నిర్ణయిస్తూ భద్రాద్రి కొత్తగూడెం డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయము వారు ఉత్తర్వులు జారీ చేశారు. వేలం పాటను గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల పంచాయతీ అధికారి వారి సమక్షములో నిర్వహించబడుతుందని, వారాంతపు సంత వేలంపాటలో పాల్గొనే వారు రూ. 5000/–లు ధరావత్తు సొమ్ము జమ చేసి వేలం పాట లో పాల్గొనాలని పంచాయతీ కార్యదర్శి బండి అనంత కుమార్ తెలిపారు.




