21 March, 2026 | 9:57 PM

కరెంట్ ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించండి.. సారు

21-03-2026 08:42 PM

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో కరెంట్ ఓవర్ లోడ్ సమస్యతో పరిష్కరించాలని శనివారం దుద్దెడ సబ్ స్టేషన్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్వేల్ సుదర్శన్ మాట్లాడుతూ అంకిరెడ్డిపల్లి గ్రామంలో  రెండు, ముడు, నాలుగు, ఎనిమిది, తొమ్మిది, పదవ వార్డులో తీవ్రమైన ఓవర్ లోడ్ సమస్య ఉందని ప్రతిరోజు ఫీజు వైరు కొట్టేయడం జరుగుతుందన్నారు.

మూడవ వార్డులో ఓవర్లోడ్ కారణంగా అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ పేలిందని, అదేవిధంగా బీసీ కాలనీలోని ఏర్పాటుచేసిన 25 కెవి ట్రాన్స్ఫార్మర్ కు 125 కుటుంబాలకు పైగా వినియోగదారులు విద్యుత్ వినియోగించుకుంటున్నారని దీని మూలంగా ఓవర్లోడ్ తీవ్రంగా ఉండి ఫీజు వైర్ కొట్టేయడం జరుగుతుందని ఏఈకి తెలిపి, అక్కడ మరొక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏ ఈ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించగా వెంటనే స్పందించి నేను విలేజ్ ని సందర్శించి ఎంక్వయిరీ చేసిన తర్వాత ఓవర్లోడ్ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకిరెడ్డిపల్లి ప్రజలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.