4 July, 2026 | 1:33 AM

ఐదెకరాల వరకు రైతు భరోసా

04-07-2026 12:59 AM

నాలుగో రోజు 4.41 లక్షల మంది రైతులకు రూ.1,188 కోట్లు జమ

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): రైతుభరోసా నిధులను నాలు గోరోజూ ప్రభుత్వం విడుదల చేసింది. 4 నుంచి 5 ఎకరాల వరకు 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో శుక్రవారం రూ. 1,188 కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేవలం 4 రోజులలోనే రైతు భరోసా పథకం కింద   65.76 లక్షల మంది రైతులకుగాను  రూ. 6,590.37 కోట్లు రైతు ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుభరోసా నిధులను రైతు ఖాతాలలో వేయ డంలో రేవంత్‌రెడ్డి సర్కార్ మరోసారి రికార్డు సృష్టించిందని చెప్పారు. ఇప్పటికే మొదటి ౪ విడతల్లో 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేశారు.