18 July, 2026 | 10:28 PM

నయనతార దంపతులపై ధనుష్ దావా

28-11-2024 12:11 AM

నటి నయనతార, నటుడు, దర్శక నిర్మాత ధనుష్‌ల మధ్య వివాదం సద్దుమణిగినట్టు అనిపించింది కానీ ఇంకా తారస్థా యికి వెళ్లింది. తాజాగా నయనతార, విఘ్నే శ్ శివన్ దంపతులపై ధనుష్ దావా వేశారు. తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని విజువల్స్‌ను ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యు మెంటరీలో వాడుకున్నారని  మద్రాస్ హై కోర్టును ఆశ్రయించి నయనతార దంపతులతోపాటు వారి రౌడీ పిక్చర్స్ సంస్థపై దావా వేశారు.

బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం విచారణకు అంగీకరించింది. ‘నానుమ్ రౌడీ దాన్’ నయన్ దంపతులకు అత్యంత కీలకం. వారి ప్రేమ చిగురించింది ఈ సినిమాతోనే కాబట్టి అందులోని సన్నివేశాలను వాడుకున్నారు. తన పర్మిషన్ లేకుండా వాడుకున్న సన్నివేశాలను తక్షణమే  తొలగించాలని.. లేదంటే రూ.10 కోట్లు పరిహారంగా చెల్లించాలని నయన్ దంపతులకు ధనుష్ నోటీసు పంపిన సంగతి తెలిసిందే.