23 July, 2026 | 1:23 AM

ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి

23-07-2026 12:43 AM

బడంగ్ పేట్  జులై 22:(విజయక్రాంతి): ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ, మాజీ మేయర్ పారిజాత నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లెలగూడ మున్సిపాలిటీ, ప్రశాంతి హిల్స్, బడంగ్ పే ట్, బాలాపూర్, మీర్పేట్ ప్రాంతాలకు చెంది న కాంగ్రెస్ నాయకులు, జిల్లా సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ప్రజాప్ర తినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు, యువత పాల్గొని కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.