16 May, 2026 | 5:35 PM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

16-05-2026 04:31 PM

జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటి గూడ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు జన్నారం తహశీల్దార్ కార్యాలయం ముందు శని వారం ధర్నాకు దిగారు. గ్రామంలో సుమారు వంద ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసినప్పటికీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జన్నారం వ్యవసాయ మార్కెట్‌లో మాత్రమే కొనుగోలు జరుగుతోందని, దూర ప్రాంతాల నుంచి తీసుకువస్తుండటంతో ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరిగి రైతులపై అదనపు భారం పడుతోందని వాపోయారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే రోటిగూడ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ బక్కయ్యకు రైతులు వినతి పత్రం అందజేశారు.