16 May, 2026 | 5:09 PM

హిందూ సంస్కృతి గొప్పది

16-05-2026 04:34 PM

ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచార ప్రముఖు తడిగుప్పుల శంకరయ్య

 శ్రీపురంలో ఘనంగా హిందూ సమ్మేళనం

ముకరంపుర,(విజయక్రాంతి): హిందూ సంస్కృతి చాలా గొప్పదని ఆ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచార ప్రముఖుల శంకరయ్య అన్నారు. శ్రీపురంలో సిరిపురం తో పాటు సమీప బస్తీలకు చెందిన ప్రాంత వాసుల హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ భారతదేశ ఆధ్యాత్మిక నైతిక ధార్మిక విజ్ఞాన సంపదకు నిలయమని, ఎందరో మహనీయులు ఇక్కడ జన్మించి మన దేశ వైభవాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. విదేశాలకు ఆధ్యాత్మిక విజ్ఞాన వైదిక ధార్మిక బిక్ష పెట్టింది మన దేశమేనని పేర్కొన్నారు. అంతకుముందు పెద్దపల్లి డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కంచర్ల శ్రీలత బోయినపల్లికి చెందిన ముక్తానంద స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బల్మురి రామచందర్  రావు, ఇంజనీర్  కోల అన్నారెడ్డి, పుర ప్రముఖులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.