29-07-2025 01:28:07 AM
భద్రాద్రి కొత్తగూడెం, జులై 28, (విజయక్రాంతి):మధ్యాహ్న భోజన పథకం కార్మికు లకు గత 4నెలల పెండింగ్ ఉన్న జీతాలు, బి ల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తెలంగాణ మ ధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(CITU అనుబంధం) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఇఓ వెంకటేశ్వ ర చారి ధర్నా దగ్గరికి వచ్చి వినతిపత్రం స్వీకరించి, మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకె ళ్తున్నా, నా పరిధిలో ఉన్న సమస్యలు బియ్యం సమస్య, ఇతర ఇతర సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షులు జి పద్మ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.శ్రీనివాస్ మాట్లాడుతూ గత 4 నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు లేవు, బిల్లులు లేవు, కోడిగుడ్ల బిల్లులు లేవు , ఎలా వంటలు చేస్తారనీ ప్రభుత్వం ప్రశ్నించారు.
మధ్యాహ్న భోజన కార్మికులు పెట్టుబడి పెట్టిన బిల్లులను ఈ కుబేర్ అని, ఎస్ టి ఓ అని, ఫ్రీజింగ్ లో ఉన్నాయని, నెలల తరబడి పెండింగ్ లో పెడుతూ మధ్యాహ్న భోజన కార్మికులను అప్పుల పాలు చేస్తుందన్నారు.కొత్త మెనూ తీసుకొచ్చి కొత్త మెనూ ప్రకారం మెనూ ఛార్జీలు పెంచకుండా రోజు కు మూడు కూరలు ఎలా పెడతారన్నారు . గ్యాస్ ఇవ్వకుండా గ్యాస్ ల మీదనే వంట చే యాలి అనడం సరైనది కాదన్నారు.
ప్రతి స్కూలుకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని, కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలని, ప్రతి నెల గ్రీన్ ఛానల్ గా వేతనాలు బిల్లులు చెల్లించాలని, ఈ ప్రభుత్వం ఇస్తానన్న పదివేల రూపాయలు ఇవ్వాలని, గుర్తింపు కార్డు లు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పిఎఫ్ ప్రమాద బీమ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా కార్యదర్శి ఎస్ డి సుల్తానా జిల్లా అధ్యక్ష సహాయ కార్యదర్శిలు రామలక్ష్మి వెంకట నరసమ్మ శివ కుమారి రాణి అరుణ, తదితరులు పాల్గొన్నారు.