29-07-2025 01:26:57 AM
ఎడమ కాలువ కింది రైతుల పరిస్థితి ప్రశ్నార్ధకం
టేకులపల్లి, జులై 28, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి ప్రాజెక్ట్ ఎడమ కాలువ ఎక్విడెక్టు కూలింది. దీంతో ఆ కాలువ కింది రైతుల పరిస్థితి ప్ర శ్నార్ధకంగా మారింది. బేతంపూడి ప్రాజెక్టుకు రెండు కాలువలు ఉంటాయి. కుడి కాలువ బేతంపూడి, కోటల్ల, తొమ్మిదోమైలుతండా, టేకులపల్లి పరిసర ప్రాంతాల రైతుల భూములకు నీరందు తాయి.
ఎడమ కాలువ ఎక్విడెక్టు ద్వారా ప్రాజెక్ట్ ఎడమ పక్క ఉన్న గుట్ట పక్కనుంచి మద్దిరాలతండా పరిసర ప్రాంత రైతుల భూములతో పాటు, మద్దిరాల ఆనకట్టలోకి నిరూప్ చేరి, అక్కడి నుంచి కుంటల్లా, దాసుతండ వరకు ఉన్న పొలాలకు నీరు చేరుతుంది. ఎడమ కాలువ ఎక్విడెక్టు కూలి పోవడంతో ఈ ఏడాది ఆ కాలువ కింది ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గ తంలో కూడా ఇదే ఎక్విడెక్టు కూలిపోవడంతో నీటిపారుదల అధికారులు మరమ్మతులు చేయించారు.
తర్వాత కూడా అప్పుడప్పుడు అక్కడక్కడా తెగి పోవడం జరిగిన మర్మతులతో సరిపు చ్చుతూ వస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడంతో ఇలాంటి ప్రరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు. ఎడమ కాలువ ఎక్విడెక్టు తెగి వారం రోజులు కావస్తున్నా వర్షాల కారణంగా అటువైపు వెళ్లి చూసినవారు లేకపోవడంతో సోమవారం ఆ ప్రాంత రైతులు గుర్తించారు.
ఇప్పుడిప్పుడే వరినార్లు పోసి దుక్కులు సిద్ధం చేసుకొంటూ వరినాట్లు వేసేందుకు సిద్దమౌతున్న తరుణంలో ఎక్విడెక్టు కూలి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే నీటిపారుదల శాఖాధికారులు చొరవ చూపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనీ రైతులు కోరుతున్నారు. ఎక్విడెక్టు కూలడంతో కాలువలో నీరంతా వృధాగా వాగులోకి పోతున్నాయనీ అంటున్నారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు కొద్దిపాటి నీరు ప్రాజెక్టులోకి చేరుకుంది.