29-07-2025 01:29:20 AM
భద్రాచలం, జూలై 28, (విజయ క్రాంతి): ఇసుక లారీలువల్ల ధ్వంసమైన రోడ్లను మరమ్మతులు చేయాలని, అధికార ప్రతిపక్ష ప్ర జాప్రతినిధులు ఇసుక రీచ్ యజమానులతో లాలూచీ పడుతూ భద్రాచలం నియో జకవ ర్గం అభివృద్ధిని తుంగలో తొక్కుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, కారం పుల్లయ్య లు అన్నా రు.
సి పిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యం లో ఇసుక లారీల వల్ల ధ్వంసం అవుతు న్న రోడ్లు మరమ్మత్తులు చేయాలని, నియోజవర్గంలోని ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడా లని కోరుతూ భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో సో మవారం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భ ద్రాచలం నియోజకవర్గం లో దుమ్ముగూ డెం, చర్ల, వెంకటాపురం మండలాల్లో అధికార,ప్రతిపక్ష పార్టీల నేతల అండ దండలతో నిర్వహిస్తున్న ఇసుకరీచుల కారణంగా ని యోజకవర్గంలోని రోడ్లు మొత్తం ధ్వంసం అవుతున్నాయని ఈ సమస్య పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అనేకమార్లు స్థానిక ప్రజలు అధికారు ల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లే దని అన్నారు.
ఇసుక లారీలు వందల సం ఖ్యలో ప్రయాణం చేయడం వల్ల రోడ్లపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అ న్నారు. తక్షణమే ప్రభుత్వం రోడ్లు మరమ్మత్తులు చేయడం కోసం నిధులు కేటాయించి రోడ్లు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుకరీచుల కారణంగా దెబ్బతింటున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల అధికా ర ప్రతిపక్ష నాయకులు కళ్ళు తెరవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు పి సంతోష్ కుమార్ డి సీత ల క్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి అజయ్ కుమార్ భూపేంద్ర యు జ్యోతి, బి కుసుమ, ఎస్ డి ఫిరోజ్, నకరికంటి నాగరాజు, డి రాఘవయ్య,కనక శ్రీ,కుంజ శ్రీనివా స్, తదితరులు పాల్గొన్నారు.