29 July, 2026 | 1:44 AM

ధోనీ క్రేజ్ తగ్గేదే లే

29-07-2026 12:46 AM

మలబార్ గోల్డ్ ప్రచారకర్తగా ఒప్పందం

ముంబై, జూలై 28: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆరేళ్లవుతున్నా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పలు బడా కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీనే ఎంచుకుంటున్నాయి.10కి పైగా సంస్థలకు ప్రచారకర్తగా ఉన్న ధోనీ ఒక్కో ఒప్పందానికి రూ.6 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. 

తాజాగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది.ది రెస్బాన్సిబుల్ జ్యువెలర్ పేరుతో కొత్త క్యాంపెయిన్‌ను ధోనీతో కలిసి నిర్వహించనుంది. పూర్తి నాణ్యతతో తాము అందించే హాల్‌మార్క్ గోల్డ్, డైమండ్స్‌కు ధోనీ లాంటి దిగ్గజం ప్రచారం తోడైతే మరో స్థాయికి వెళుతుందని మలబార్ గోల్డ్ ఛైర్మన్ ఎం పి అహ్మద్ తెలిపారు.