15 July, 2026 | 12:04 PM

డీజిల్ ట్యాంకర్ బోల్తా

08-06-2024 01:56 AM

బకెట్లు, క్యాన్లతో ఎగబడిన జనం

యాదాద్రి భువనగిరి, జూన్ 7 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో బకెట్లు, క్యాన్లతో డీజిల్ పట్టుకె ళ్లడానికి జనం ఎగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. డీజిల్ తీసుకెళ్తున్న ట్యాంకర్ శుక్రవారం బొమ్మల రామా రం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామం వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్యాంకర్ అవుట్ వాల్వ్ నుంచి డీజిల్ బయటకు రాగా.. జనం బకెట్లు, క్యాన్లతో ఎగబడ్డారు. తమ వెంట తెచ్చుకున్న డబ్బాల్లో డీజిల్ పట్టుకెళ్లారు.