15 July, 2026 | 10:39 AM

ఒప్పందానికి రాకుంటే ఇరాన్‌లో ఎవరూ మిగలరు.. ట్రంప్ హెచ్చరిక

15-07-2026 10:38 AM

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మరోసారి ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే చర్చలకు రాకుంటే ఇరాన్ పై విరుచుకుపడతామని ట్రంప్ హెచ్చరించారు. విద్యుత్ కేంద్రాలు, ప్రజా మౌలిక వసతులపై విరుచుకుపడతామని ట్రంప్(Donald Trump) వెల్లడించారు. రేపు, ఎల్లుండి ఇరాన్ ను దెబ్బతీస్తామని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే వారం నుంచి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుందని ట్రంప్ ప్రకటన చేశారు. ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్ లో ఎవరూ మిగలరని ట్రంప్ తేల్చిచెప్పారు.

తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటన(Iran's Announcement) చేసింది. నౌకాదళ దిగ్బంధనంతో ఒప్పందాన్ని అమెరికా ముక్కలు చేసిందని టెహ్రాన్ ఆరోపించింది. ఇక ఒప్పందం అవసరం తమకు ఏమాత్రం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాతో చర్చల ప్రస్తావన తేబోమని ఇరాన్ ప్రకటించింది. అమెరికా చర్యలు ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ చెబుతోంది. గల్ఫ్ నుంచి ఏమాత్రం చమురు, గ్యాస్ ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని ఇరాన్ వెల్లడించింది.