15 July, 2026 | 9:55 AM

అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మార్నింగ్ వాక్

15-07-2026 09:48 AM

అచ్చంపేట, జూలై 15: అచ్చంపేట పట్టణంలోని 18వ వార్డులో ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించిన ఆయన స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అచ్చంపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని వెంటనే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి వార్డులో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సహకారంతో అచ్చంపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.