15 July, 2026 | 11:55 AM

ఎన్నికల్లో ప్రజలు మద్దతిచ్చారు

08-06-2024 01:57 AM

కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి 

సీఎం రేవంత్‌రెడ్డి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, అందుకే పార్లమెంట్ ఎన్నికలు తమ ప్రభుత్వానికి రెఫరెండమని ప్రకటించారని మల్లు రవి గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 8 ఎంపీ సీట్లు, ఒక ఎమ్మెల్యే సీటు గెలిపించి మద్దతుగా నిలిచారని తెలిపారు.