తాగునీటి బోర్ల లెక్కల్లో తేడా?
సమీక్షలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, జూన్ 11 (విజయక్రాం తి): వేసవిలో తాగునీటి సమస్యను పరిష్క రించేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి 100 బోర్లు వేసినట్టు అధికారులు చెప్తున్నా.. కాగితాల లెక్కలు ఎక్కడా సరిపోవడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీని వాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవా రం కలెక్టరేట్‌లో కలెక్టర్ జీ రవినాయక్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి సేవ చేయాలని ఆదే శించారు.
త్వరలోనే కొత్త రేషన్ కార్డు లను జారీచేస్తుందని తెలిపారు. మిషన్ భగీరథ నీటిని కంపెనీలకు ఉపయోగిస్తు న్నట్లు తన దృష్టికి వచ్చిందని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పట్టణంలోని తిరుమల దేవుని గుట్ట వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం రైల్వే అధికారులను సంప్రదించి, పనులు చేపట్టాలని సూచిం చారు. అనంతరం పట్టణంలోని పెద్ద చెరువు ను పరిశీలించారు. అంతకు ముందు ప్రైవే టు స్కూల్స్ అసోసియేషన్ నేతలు ఎమ్మెల్యే ను కలిసి బస్సుల ఫిట్‌నెట్ చేసుకునేంపదకు సమయం ఇప్పించాలని కోరగా అధికా రులతో ఫోన్‌లో మాట్లాడి గడువును ఇప్పించారు.






