పని చేతగాకపోతే ఇంట్లో కూర్చోండి
అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే కడియం హెచ్చరిక
జనగామ, జూన్ 11 (విజయక్రాంతి): పనిచేయడం చేతగాకపోతే ప్రభుత్వాధికారులు, సిబ్బంది ఇంట్లో కూర్చోవాలని, విధులను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఊరుకోనని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెచ్చ రించారు. మంగళవారం జనగామ కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో సమీ క్షించారు. నియోజకవర్గంలో ముఖ్యమైన లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
సీడీపీ నిధుల నుంచి చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు, వేలేరులో సమీకృత మండల కార్యాలయాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామపంచాయతీల భవనాల నిర్మాణాలకు స్థలం సేకరించాలని కోరారు. అధికారులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్, పీఆర్ ఎస్‌సీ రఘువీరారెడ్డి, హన్మకొండ, జనగామ ఈఈలు వెంకటయ్య, చంద్రశేఖర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.






