08-12-2025 01:25:55 AM
రంగారెడ్డి,డిసెంబర్ 7 (విజయక్రాంతి ): స్థానిక పోరులు డిజిటల్ ప్రచారం జోరందుకుంది. గత ఎన్నికల్లో ప్రచార శైలి కి విభిన్నంగా... ఈ దఫా ప్రచారం అంతా సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. సర్పంచ్, వార్డులో బరిలో ఉన్న అభ్యర్థులంతా స్థానిక సమస్యలు, తమకు మద్దత్తు ప్రకటించి ప్రజలు గెలిపిస్తే నెరవేర్చి హామీలన్నీ సోషల్ మీడియా వేదికంగానే డిజిటల్ ప్రచారం చేస్తున్నారు.
గ్రామంలో ప్రత్యేక సోషల్ మీడియా గ్రూపులను క్రియేట్ చేసి... అందులో ఓటర్ల ను సభ్యులుగా చేసి సులువుగా ఓటర్లకు తమ ప్రచారం చేరేలా అభ్యర్థులు ప్రత్యేకంగా సోషల్ మీడియా కంటెంట్ ను ఆయా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఎన్నికల ప్రచారం అంటే ఊరు రా వాహనాలను తిప్పుతూ... కళాకారులు మైకుల ద్వారా అభ్యర్థులు ప్రచారం చేసి ఓట్లను రాబట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేసేవారు. కానీ ప్రస్తుతం ఎన్నికలు అంటేనే అంతా స్మార్ట్ గా ఆలోచన చేస్తున్నారు.
మారుతున్న కాలానుగుణంగా ఓటర్లను ఆకట్టుకునేలా బరిలో ఉన్న అభ్యర్థులంతా తమ క్రియేటివిటీని అంతా ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. నేడు పల్లె పోరులో సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తున్నా యి. ఓటర్లను ఆకట్టుకునేలా గ్రామాల వారీగా పదుల సంఖ్యలో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం లభిస్తుండటంతో అభ్యర్థులు ఆసక్తి చూపు తున్నారు. నిమిషాల వ్యవధిలోనే ఓటర్లకు చేరు వవుతున్నారు.
పోటాపోటీగా హామీల వర్షం.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు వాట్సాప్ లో ప్రచారం పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. తమ పద్ధతికి దీటుగా హామీల వర్షం... గతంలో తాను గ్రామంలో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలను సంబంధించిన వీడియోలు ఫోటోలు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తు ఓటర్ల మద్దతు కూడ గడుతున్నారు. రాజకీయం ఆరగ్రేటం మొదలుకొని...
తమ కుటుంబ నేపథ్యం, అధికార, ప్రతిపక్ష పార్టీల చెందిన అభ్యర్థులంతా డిజిటల్ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒకరికి ఒక మొబైల్ ఉండడంతో అభ్యర్థులకు డిజిటల్ ప్రచారం మరింత ఈజీ అయింది. తమ కు మదత్తు తెలిపి గెలిపిస్తే అభ్యర్థులు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేయించి సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు, సభలు ఉన్న పంచాయతీలో ఉన్న అన్ని గ్రూపుల్లో పోస్ట్ సమాచారం మరింత చేరువ చేస్తున్నారు.