16 July, 2026 | 1:20 AM

వినియోగంలోకి డిజిటల్ డిస్‌ప్లే బోర్డు

16-07-2026 01:15 AM

మహబూబాబాద్, జులై 15 (విజయక్రాంతి): కేసముద్రం మార్కెట్లో అన్ని అలంకారప్రాయం..! అనే శీర్షికతో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నిరుపయోగంగా వదిలేసిన పలు సౌకర్యాల పై ఈ నెల 7న విజయక్రాంతి పత్రికలో ప్రచురించిన ప్రత్యేక వార్తా కథనానికి అధికారులు స్పందించారు. 22 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ నామ్ విధానాన్ని ఎప్పటికప్పుడు రైతులకు ఉపయోగపడే విధంగా డిజిటల్ డిస్ప్లే బోర్డులను వినియోగంలోకి తెచ్చారు.

సాంకేతిక సమస్యను తొలగించి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈ నామ్ విధానం ద్వారా రైతుల పంట ఉత్పత్తుల కొనుగోలు, లభించిన ధరలు, వివిధ రకాల పంట ఉత్పత్తులకు లభించిన ధరలు ఎప్పటికప్పుడు డిజిటల్ డిస్ప్లే బోర్డులో కనిపించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనితో రైతులు డిజిటల్ డిస్ప్లే ద్వారా వివరాలను ఎప్పటికప్పుడు వీక్షించే వెసులుబాటు కలిగింది.