నెలాఖరులోగా నామినేటెడ్ భర్తీ!
- 50కి పైగా పోస్టులకు నియామకాలు
- పనితీరు బాగున్నవారికి రెన్యూవల్
- డీసీసీల పనితీరుపైనా సమీక్ష
- చిట్‌చాట్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి) : రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరులోగా 50కి పైగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతుందని, గతంలో సమర్థంగా పనిచేసిన వారిని రెన్యూవల్ చేసే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు.
పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీపై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై చర్చించనున్నట్లు తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ సంస్థాగత నియామకాలపై భర్తీపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిపారు. అదే విధంగా డీసీసీ అధ్యక్షుల పనితీరుపై స్పందించిన మహేష్‌కుమార్‌గౌడ్.. నలుగురు, ఐదుగురు మినహా మిగిలిన వారంతా సమర్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
పనితీరు ఆశించిన స్థాయిలో లేని చోట మార్పులు చేసే అవకాశం ఉంటుందన్నారు. మండల కమిటీల నియామకాల్లో మాత్రం డీసీసీ అధ్యక్షులదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఖమ్మం రాజకీయాలపై స్పందిస్తూ.. ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే విషయాన్నే ఆమె తనతో చెప్పారని, అంతకు మించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కాంగ్రెస్‌కు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సీపీఐ తమ మిత్రపక్షమే అయినప్పటికీ, కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉందని, ఆ కార్యకర్తల మనోభావాలను దష్టిలో పెట్టుకొని ఎంపీ రఘురామిరెడ్డి మాట్లాడి ఉండొచ్చన్నారు. పార్టీలో చిన్నచిన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవాలని, ప్రతి అంశానికీ గాంధీభవన్‌కు రావాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు మహేష్‌కుమార్‌గౌడ్ సూచించారు.
నామినేటెడ్ పదవుల్లో మాకూ చోటు కల్పించాలి
- మీనాక్షి నటరాజన్‌కు డీసీసీ అధ్యక్షుల వినతి
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పనితీరుపై దృష్టి సారించిన ఏఐసీసీ.. బుధవా రం 19 మంది డీసీసీ అధ్యక్షులతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కు మార్‌గౌడ్ ప్రత్యేకంగా సమావేశం అ య్యారు. నామినేటెడ్ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలని డీసీసీ అ ధ్యక్షులు కోరగా, పార్టీ కోసం మొదటి నుంచి సిన్సియర్‌గా కష్టపడిన వారికి న్యా యం జరుగుతుందని మీనాక్షినటరాజన్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం.
డీసీసీ అధ్యక్షులు తమ పనితీరును చెప్పుకోవడానికి, నివేదికను అందించడానికి ఒక్కొక్కరి కి 20 నిమిషాల సమయం కేటాయించా రు. తమ పనితీరు వివరించడంతో పాటు తమ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకుల సహకారం ఎంతవరకు ఉంది?, వారితో సమస్యలు ఉన్నాయా? పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది? ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లుతున్నారు? క్షేత్ర స్థాయిలో పార్టీ పనితీరుతో పాటు కమిటీల నియామకం ఎలా పూర్తి చేశారు? త దితర అంశాలపై ఆరా తీసినట్లు సమాచా రం.
ప్రధానంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)పై అడిగి తెలుసుకున్నారు. ఏఐసీసీ, పీసీసీ కార్యక్రమాల అమలుపైనా ఆరా తీశారు. పనితీరు ఆధారంగా డీసీసీ అధ్యక్షులకు రేటింగ్ కూడా ఇస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ల నుంచి సహకారం అందడం లేదని, ప్రొ టోకాల్ సమస్య ఎదురవుతుందని పలువురు డీసీసీ అధ్యక్షులు మీనాక్షినటరాజన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిసింది. సమస్యలు ఎదురుకాకుండా చూస్తామని హా మీ ఇచ్చినట్లుగా సమాచారం.






