22 April, 2026 | 2:04 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

పైసాలో డిజిటల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ

26-12-2024 12:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 25: ఎన్‌బీఎఫ్‌సీ పైసాలో డిజిటల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ జారీచేసి రూ. 258.16 కోట్లు సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీచేసే ఒక్కో కన్వర్ట్‌బుల్ ఈక్విటీ వారంట్ ధరను రూ. 58.20 గా నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వారెంట్లను నాన్-ప్రొమోటర్ గ్రూప్ సంస్థలకు కేటాయిస్తారని, ప్రతిపాదిత కేటాయింపుదారుల్లో యూనికో గ్లోబల్ ఆపర్చూనిటీస్ ఫండ్,  నోవా గ్లోబల్ ఆపర్చూనిటీస్ ఫండ్, పీసీసీ టచ్‌స్టోన్‌లు ఉన్నాయి. ఇటీవల ఆర్బీఐ, ఈసీబీ మార్గదర్శకాల ప్రకారం 50 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల ఇష్యూ(ఎఫ్‌సీసీబీలు)లో తొలి విడత నిధుల్ని విజయవంతంగా సమీకరించినట్లు పైసాలో  డిజిటల్ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30నాటికి కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తులు 19 శాతం వృద్ధితో రూ.4,535.2 కోట్లకు చేరాయి. ఆదాయం 33 శాతం పెరిగి రూ.373.6 కోట్లకు, నికరలాభం 6 శాతం వృద్ధితో రూ.91.4 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.