2 May, 2026 | 7:24 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

శిథిలావస్థలో అంగన్వాడి.. బిక్కు బిక్కు మంటూ చూస్తున్న చిన్నారులు

07-11-2024 10:51 AM

మెదక్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామయ్య పల్లి గ్రామంలోఉన్నటువంటి అంగన్వాడి సెంటర్ లో సొంత భవనం లేక  పాత పాడుబడిన రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. వర్షం పడితే రేకుల నుంచి నీరు కరడం వల్ల పైన టాపర్ ఏర్పాటు చేసి దాంట్లోనే చిన్నారులకు పాఠాలు మరియు భోజన సదుపాయం కలిగించారు.

గ్రామంలో ఇంకా ఇతర ప్రభుత్వ బిల్డింగులు ఉన్న వాటిని ఏర్పాటు చేయకుండా పాత రేకులా భవనంలో ఏర్పాటు చేయడంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి గ్రామంలో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాల్లో అంగన్వాడి కేంద్రాన్ని  కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.