calender_icon.png 20 May, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

07-11-2024 10:45:01 AM

రాజేంద్రనగర్,(విజయక్రాంతి): ప్రేమ విఫలమై తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ కు చెందిన సాయికుమార్ చదువుకుంటూ స్థానికంగా ఎలక్ట్రిషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ప్రేమ విఫలమయిందని తీవ్ర మనస్తాపం చెందిన అతడి బుధవారం అర్ధరాత్రి గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని తనువు చాలించాడు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు గురువారం ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.